కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని (Karimnagar) వావిలాలపల్లె ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో లయన్స్ క్లబ్ (Lions Club) ఆధ్వర్యంలో విద్యార్థులకు చెస్ బోర్డులు, బట్ట సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్ననాటి నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచాలని సూచించారు. చెస్ ఆట ద్వారా మేధాశక్తి, ఏకాగ్రత, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువుతో పాటు మేధోపరమైన క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం విద్యార్థులకు బట్ట సంచులు అందజేసి, పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్ పటేల్, జోనల్ చైర్మన్ లయన్ ముక్క శరత్ కృష్ణ, కార్యదర్శి లయన్ బట్టు వినోద్, ట్రెజరర్ లయన్ మెతుకు కృష్ణ చైతన్య, జాయింట్ ట్రెజరర్ లయన్ ఐత సూరజ్ కుమార్, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, తాటిపెల్లి సతీష్ బాబు, ప్రధానోపాధ్యాయురాలు కాపర్తి జ్యోతి లక్ష్మి, ఉపాధ్యాయురాలు కె. మమత, విద్యార్థులు పాల్గొన్నారు.

