అమ్మపాలెంలో పేకాట శిబిరం గుట్టురట్టు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని అమ్మపాలెం (Ammapalem) గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి గుట్టురట్టు చేశారు. వేంసూరు ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది ఆదివారం సాయంత్రం చేపట్టిన ఈ ఆకస్మిక దాడిలో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మపాలెం గ్రామం ఊరి చివర చెరువు సమీపంలో కంచర్ల వెంకటేశ్వరరావు (అలియాస్ జయం), శ్రీహరి నిర్వాహకులుగా వ్యవహరిస్తూ కొంతమందిని సమీకరించి డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

దాడి సమయంలో ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా, మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారిలో వేంసూరుకు చెందిన షేక్ మోహిద్దీన్, చింతా వెంకటేశ్వరరావు, షేక్ యాకూబ్ పాషా (అలియాస్ బాబు), మర్లపాడుకు చెందిన పూరెటి శ్రీనివాసరావు, లచ్చన్నగూడెంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పూరెటి శ్రీనివాసరావు ఉన్నారు. పేకాట నిర్వాహకులు కంచర్ల వెంకటేశ్వరరావు, శ్రీహరితో పాటు ఏఆర్‌పీసీ డ్రైవర్ మహమ్మద్ ఇమ్రాన్, మరికొందరు పరారయ్యారు. పట్టుబడిన వారిని విచారించగా పలువురు వ్యక్తులు పేకాట శిబిరంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి 52 పేక ముక్కలు, రూ.2 వేల నగదు, 10 మోటార్ సైకిళ్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>