కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండల కేంద్రం రైతులు, గ్రామస్తుల నినాదాలతో మార్మోగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు బంద్కు పిలుపునిచ్చారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, లాయర్ల సంఘాలు మద్దతు తెలిపాయి. కామారెడ్డిలో ఏర్పాటుకాబోతున్న ఫార్మా కంపెనీని బిక్కనూరు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఫార్మా కంపెనీ ఏర్పాటుచేస్తే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు అధికారులు సేకరణ చేస్తుండగానే, మరోవైపు రైతులు (Farmers) నినాదాలు చేశారు. ప్రజా ఆమోదం మేరకే నిర్ణయాలు ఉంటాయని, నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది ఫార్మా కంపెనీలు ఉండగా, మరో కంపెనీని ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Read Also: హైదరాబాద్ లో జర్నీ ఇక ఈజీ.. త్వరలోనే కామన్ మొబిలిటీ కార్డు..!
Follow Us On : WhatsApp


