కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను సందర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే గతంలోనే ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. వైసీపీ హయాంలో హయాంలో డయాఫ్రమ్ వాల్ కూడా కాపాడలేకపోయారని విమర్శించారు.
ఐఐటీ హైదరాబాద్ నిపుణులు చెప్పాకే డయాఫ్రమ్ వాల్ పాడయిందని గతంలోని ప్రభుత్వానికి తెలిసిందని చెప్పారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. 2027 ఫిబ్రవరి 15 వరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఫెజ్–1 , ఆ తరువాత ఫేజ్ –2 పనులపై దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Read Also: అమరావతిలో మంత్రి నారాయణకు చేదు అనుభవం
Follow Us On: Youtube


