epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సింగపూర్​ సైన్యంలో లాలూ మనవడు!

కలం, వెబ్​డెస్క్​: బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ (Lalu Prasad Yadav )​ మనవడు ఆదిత్య యాదవ్ (18) సింగపూర్​ సైన్యంలో చేరాడు. ఈ మేరకు ఆదిత్య తల్లిదండ్రులు రోహిణి ఆచార్య, సమరేశ్​ సింగ్​ బుధవారం సోషల్​ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కుమారుడి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, అభినందనలు తెలిపారు. ​అయితే, ఆదిత్య సింగపూర్​ మిలట్రీలో సైనికుడిగా చేరడం లేదు. సింగపూర్​ పౌరులు ఎవరైనా సరే 18 ఏళ్లు నిండిన తర్వాత సైన్యంలో రెండేళ్లు బేసిక్ మిలట్రీ ట్రైనింగ్​(బీఎంటీ) శిక్షణ పొందాలి.  ఇది సింగపూర్​ పౌరసత్వ నిబంధనల ప్రకారం తయారుచేసిన నేషనల్​ సర్వీస్​(ఎన్​ఎస్​)లో భాగం.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆదిత్య సింగపూర్​ సైన్యంలో చేరాడు. రెండేళ్ల పాటు క్రమశిక్షణ, విలువలు, ఓర్పు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోనున్నాడు. అలాగే శారీరక దృఢత్వం, డ్రిల్స్​, ఆయుధాల వాడకం, ఫీల్డ్​ ఎక్సర్​సైజెస్​ వంటి వాటిలో శిక్షణ పొందనున్నాడు. సింగపూర్​ ఆర్మ్​డ్​ ఫోర్సెస్​, సింగపూర్​ సివిల్ డిఫెన్స్​ ఫోర్సెస్​, సింగపూర్​ పోలీస్​ ఫోర్స్​లో తన రెండేళ్ల శిక్షణ కాలం పూర్తిచేయనున్నాడు. కాగా, లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav)​, రబ్రీదేవి దంపతులకు మొత్తం తొమ్మిది మంది సంతానం. అందులో రోహిణి ఆచార్య రెండో వ్యక్తి.

Read Also: కుక్క క‌రిచే మూడ్‌ గుర్తించలేం.. వీధికుక్క‌ల‌పై సుప్రీం కోర్ట్ కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>