Mobile Popup Ad
Mobile Popup Ad

సాగు నీరు అంద‌క వాటర్ ట్యాంకర్లతో పొలానికి నీళ్లు!

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో ప‌లు చోట్ల పొలాల‌కు సాగు నీరు అంద‌క రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొద్ది రోజుల్లో పంట చేతికొచ్చే స‌మ‌యంలో నీళ్లు అంద‌క పొలం ఎండిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జనగామ (Jangaon) జిల్లా తరిగొప్పుల మండలం అంకుశాపురం గ్రామంలో సంగం కొమురవెల్లి అనే రైతు త‌న పొలానికి ట్యాంక‌ర్‌తో నీళ్లు పెట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సాగు నీరు అందక పొలం ఎండిపోతుందని, ఇక ఏం చేయాలో తెలియ‌క‌ వాటర్ ట్యాంకర్లతో పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నామ‌ని కొముర‌వెల్లి చెప్తున్నారు. ఇప్ప‌టికే పొలం కోసం అప్పు చేసి పెట్టుబడి పెట్టానని, పంట రాక‌పోతే తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని తెలిపారు.

Read Also: రెండు కోట్ల ఓట్లు గల్లంతు.. ‘సర్’ ప్రాసెస్ ఎఫెక్ట్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>