కలం, వెబ్ డెస్క్ : ‘సర్’ (SIR) పదం వింటేనే రాజకీయ పార్టీల్లో ఒణుకు పుడుతోంది. ఎన్ని లక్షల ఓట్లు గల్లంతవుతాయోననే ఆందోళన నెలకొన్నది. ఇప్పటివరకు సర్ జరిగిన అన్ని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలోనే ఓటర్ల పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి. ఇంకా 22 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉన్నది. దీంతో ఈ ప్రాసెస్ మొదలైన తర్వాత ఎంతమంది పేర్లు ఓటర్ల లిస్టు నుంచి మిస్ అవుతాయోననే చర్చలు మొదలయ్యాయి. ఇందుకు బలం చేకూర్చే విధంగా ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్లకు పైగా ఓటర్ల పేర్లు ఫైనల్ లిస్టు నుంచి గాయబ్ అయ్యాయి.
చివరకు ఆ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 13.39 కోట్లుగా తేలింది. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనివారి పేర్లే డిలీట్ అయినట్లు తేలింది. ఇందులోనూ మెజారిటీ పేర్లు మహిళలవే. కానీ కొత్తగా 84 లక్షల మంది పేర్లు జాబితాలో చేరాయి. కొత్తగా చేరినవాటిని మినహాయిస్తే దాదాపు మూడు కోట్ల మంది పేర్లు ఇంతకాలం ఉన్న ఓటర్ల జాబితా నుంచి డిలీట్ అయినట్లయింది. కొత్తగా చేరినవారిని పరిగణనలోకి తీసుకుంటే ఫైనల్‌గా 2.04 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి రిమూవ్ అయ్యాయి.
Read Also: ఐలాపూర్‌లో హైడ్రా భారీఆపరేషన్ ఎలా సాధ్యమైంది?
Follow Us On : WhatsApp

