Mobile Popup Ad
Mobile Popup Ad

అమీన్‌పూర్‌లో హైడ్రా యాక్షన్​: ముఖీమ్ గెస్ట్​ హౌస్​ కూల్చివేత

కలం, వెబ్​ డెస్క్​ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ (Aminpur) మండలంలో హైడ్రా (HYDRA) ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఐలాపురం విలేజ్ పరిధిలో భారీ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 860 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.

ఐలాపురం గ్రామం, ఐలాపురం తండాలోని పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలు, ఖాళీ స్థలాలపైనే దృష్టి సారించారు. ఇందులో ప్రధానంగా 1998 నుంచి కోర్టు స్టే ఆర్డర్ అమలులో ఉన్నప్పటికీ, వాటిని ఖాతరు చేయకుండా న్యాయవాది ముఖీమ్ నిర్మించిన గెస్ట్ హౌస్‌ను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఆయన సోదరుడు అజీమ్ నిర్మించిన భారీ ఆరు అంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు.

ఐలాపురం పరిధిలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇప్పటికే అక్కడ అనేక నివాసాలు వెలిశాయి. అయితే ఆ ఇళ్ల జోలికి వెళ్లకుండా, మిగిలి ఉన్న 860 ఎకరాల విలువైన భూమిని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ సుమారు 15 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Read Also: హెల్తీ తిరామిసు: స్పెషల్ వీగన్ డెజర్ట్ రెసిపీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>