Mobile Popup Ad
Mobile Popup Ad

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

కలం, వెబ్‌డెస్క్: నేటి కార్పొరేట్ సంస్కృతిలో ‘కాఫీ కల్చర్’ ఒక భాగమైపోయింది. స్నేహితులు కలిసినప్పుడు అయినా, ఆఫీస్ బిజినెస్ మీటింగ్‌లకైనా కాఫీ షాపులు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అంతే కాదు కోట్ల మందికి ఉదయాన్నే రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఇదొక ఇంధనంలా పనిచేస్తుంది. అలసటను పోగొట్టుకుని, తక్షణ ఉత్సాహాన్ని పొందడానికి చాలా మంది స్ట్రాంగ్ టీ లేదా కాఫీలను తాగుతుంటారు. కానీ పరిమితికి మించి కాఫీని సేవించడం (Coffee Consumption) వల్ల శరీరానికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ శృతిమించితే కలిగే ప్రధాన నష్టాలేమిటో తెలుసుకుందాం?

రోజూవారి జీవితంలో ఉండే పని ఒత్తిడి, ఇంట్లో టెన్షన్స్ ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి చాలా మంది కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. మరికొందరైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కనీసం 3-4 సార్లైనా కాఫీ తాగుతారు. మరికొందరైతే సాయంత్రం 4 అవ్వగానే కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిల్లో కెఫిన్ సహజంగానే ఉంటుంది. ఇది మన నరాల వ్యవస్థను ప్రేరేపించి, తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతుంది. అయితే దీని వల్ల మనకు ఉపశమనం కలిగిన ఫీలింగ్ వస్తుంది. అయితే దీనిని ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఒక రోజులో ఎంత కాఫీ తీసుకోవడం సురక్షితం

సాధారణంగా ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి రోజుకు 400 mg వరకు కెఫిన్ తీసుకోవడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 3 నుండి 4 కప్పుల టీ లేదా కాఫీ తాగవచ్చు. గర్భిణీ స్త్రీలు, రక్తపోటు ఉన్నవారు, ఆందోళన సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ మోతాదును ఇంకా తగ్గించాలని చెబుతున్నారు. అంటే రోజుకు ఒక సారి లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం అంటున్నారు.

కాఫీ ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి
నిద్రలేమి

మెదడులో నిద్రను ప్రేరేపించే ‘అడెనోసిన్’ అనే రసాయనాన్ని కెఫీన్ అడ్డుకుంటుంది. ఇది నిద్ర నాణ్యతను తగ్గించి, ఇన్సోమ్నియా నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది.

గుండె వేగం పెరగడం

కెఫిన్ తాత్కాలికంగా గుండె వేగాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు , గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్యలు ఉన్నవారు కాఫీ లేదా టీకి దూరంగా ఉండడం మంచిది.

మానసిక ఒత్తిడి

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన, చికాకు, చేతులు వణకడం, అకస్మాత్తుగా కోపం రావడం వంటివి జరగవచ్చు. అందుకే ఎక్కువగా కాఫీ లేదా టీ అలవాటు చేసుకోవద్దు.

జీర్ణ సమస్యలు

కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా అసిడిటీ, గుండెల్లో మంట, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన మోతాదులో కాఫీ తీసుకోవడం (Coffee Consumption) మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 Read Also: ‘టెర్మినాలియా టోమెంటోసా’.. దాహాన్ని తీర్చే అద్భుత వృక్షం!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>