Mobile Popup Ad
Mobile Popup Ad

కారేపల్లిలో ఘోర ప్రమాదం.. క్రేన్ బోల్తా పడి డ్రైవర్ మృతి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా కారేపల్లి మండల పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై క్రేన్ వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కారేపల్లి మండలానికి చెందిన రాజు అనే యువకుడు క్రేన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయన ఇల్లందు వైపు నుంచి ఖమ్మం వైపునకు క్రేన్ వాహనంతో బయలుదేరాడు. వాహనం కారేపల్లి మండలంలోని గాంధీపురం గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. భారీ వాహనం కావడం, అది కాస్తా డ్రైవర్ క్యాబిన్ వైపు తిరగబడటంతో రాజు లోపలే ఇరుక్కుపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ​

ప్రమాద శబ్దాన్ని విన్న స్థానికులు, తోటి వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కారేపల్లి పోలీసులు స్థానికుల సహాయంతో క్రేన్ క్యాబిన్ నుంచి రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, క్రేన్ డ్రైవింగ్ ద్వారా వస్తున్న సంపాదనతోనే ఇల్లు గడుపుతున్న రాజు అకాల మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు.

Read Also: కాఫీ ఎక్కువగా తాగుతున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>