కలం వెబ్ డెస్క్ : రెడ్ బుక్(Red Book) పేరుతో ఏపీని నాశనం చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి(Kasu Mahesh Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు(Palnadu) జిల్లాలోని పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. న్యాయం జరగకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీతో విచారణ చేపిస్తామని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వాళ్లు, వెనుకుండి చేపించిన వాళ్లు, అండగా నిలుస్తున్న యరపతినేని శ్రీనివాస్, పోలీసులకు తప్పకుండా గుణపాఠం చెప్తామని అన్నారు. అందరికీ టైం వస్తుందని, ప్రజాక్షేత్రంలో ఈ తప్పులను ఎండగడతామని చెప్పారు. ప్రశాంతంగా వెళ్లి సాల్మన్ దహనదంస్కరణలు చేయడానికి వెళ్తే పోలీసులు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. సాల్మన్ అంత్యక్రియలు ఈరోజు జరగకపోతే రేపు వైయస్ జగన్ వచ్చి దహనసంస్కరణలు చేపిస్తారని చెప్పారు.


