కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranti)ని టార్గెట్ చేసుకొని భారీ సినిమాలతోపాటు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అన్ని సినిమాలు దాదాపుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కాయి. సంక్రాంతి రేసులో చిరు మూవీతో పాటు చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) మూవీ కూడా పాజిటివ్ వైబ్‌ను సొంతం చేసుకుంది. గత సంక్రాంతి సీజన్‌లో ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి సంచలన విజయాలు సాధించాయి. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ శర్వా మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారీ నారీ నడుమ మురారితో వచ్చాడు. తక్కువ స్క్రీన్లు ఉన్నప్పటికీ ఈ చిత్రం మంచి కలెక్షన్లతో ప్రారంభమైంది.
సంక్రాంతి రోజున కలెక్షన్ల సంఖ్య పెరిగింది. ఆంధ్రప్రదేశ్, నైజాం అంతటా దాదాపు అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు ఉన్నాయి. ఫుల్ కామెడీ చిత్రంగా ప్రశంసలు అందుకుంటోంది. దీంతో మరిన్ని అదనపు షోలు పడనున్నాయి. థియేటర్ల సంఖ్య కూడా పెరగనుంది. జీవితంలో ఇద్దరు స్త్రీల మధ్య ఇరుక్కుపోయిన శర్వా వినోదభరితమైన పాత్రలో అలరించాడు. ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు రామ్ అబ్బరాజు శర్వా మూవీని డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్ సినిమాల పోటీని తట్టుకొని మరీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది ఈ మూవీ.


