అలర్ట్.. మార్చిలో వరుసగా బ్యాంకులకు సెలవులు, అప్డేట్స్ ఇదిగో

కలం, వెబ్ డెస్క్: మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు (Bank Holidays) రాబోతున్నాయి. మార్చి నెలలో ఆదివారాలు (1, 8, 15, 22, 29) ఉండగా, రెండు, నాలుగో శనివారాల (14, 28) కారణంగా బ్యాంకులు సాధారణ సెలవులను పాటించనున్నాయి. వీటితో పాటు వివిధ ప్రాంతీయ పండుగల సందర్భంగా మరికొన్ని రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి.

ముఖ్యంగా మార్చి 2, 3, 4 తేదీల్లో హోలీ (Holi) వేడుకల వల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయంగా సెలవులు ఉండవచ్చు. అలాగే మార్చి 19న ఉగాది, మార్చి 21న ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్), మార్చి 26, 27 తేదీల్లో శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి.  ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి కాబట్టి వినియోగదారులు బ్యాంక్ పనివేళలను చెక్ చేసుకోవడం బెటర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>