Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమల క్యూలైన్లలో కొట్టుకున్న భక్తులు

కలం, డెస్క్ : తిరుమల (TIrumala) క్యూలైన్లలో భక్తులు కొట్టుకోవడం సంచలనంగా మారింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ దగ్గర్లోని క్యూలైన్ లో సోమవారం వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు భక్తుల మధ్య వ్యక్తిగత దూషణలు కాస్తా.. కొట్టుకోవడం దాకా వెళ్లింది. ఓ భక్తుడు అందరి ముందే బెల్ట్ తీసి అవతలి వ్యక్తిని కొట్టాడు. దీంతో ఘర్షణ కాస్తా పెద్దదిగా మారింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, సేవకులు వచ్చి వారిని ఆపారు. ఈ ఘటనపై టీటీడీ రియాక్ట్ అయింది. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఇలా కొట్టుకోవడం సరైంది కాదంటూ తెలిపింది. అందరూ క్యూలైన్ రూల్స్ ను పాటిస్తూ దర్శనం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>