epaper
Tuesday, March 3, 2026
epaper

కస్టోడియల్​ టార్చర్​ కేస్​.. సునీల్​ నాయక్​కు హైకోర్టు షాక్​

కలం, వెబ్​ డెస్క్​: కస్టోడియల్​ టార్చర్​ చేసినట్లు నమోదైన కేసులో ఐపీఎస్​ సునీల్​ నాయక్​కు(IPS Officer Sunil Naik) ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్​ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడంలో సునీల్ నాయక్​ పాత్ర ఉందని ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం బిహార్​లో ఫైర్​ డిపార్ట్​మెంట్​ ఐజీగా పనిచేస్తున్న సునీల్​ నాయక్​ను అరెస్ట్​ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారు.

అయితే, బిహార్​ ప్రభుత్వం అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్​ కోరుతూ సునీల్ నాయక్​ ఏపీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. తాను ప్రస్తుతం ఐజీ హోదాలో ఉన్నానని, చట్టానికి గౌరవం ఇచ్చి, విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కాబట్టి తనకు అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించాలని ఆయన(IPS Officer Sunil Naik) కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 5 నుంచి 9 వరకు దర్యాప్తు అధికారి ముందు సునీల్​ నాయక్​ హాజరుకావాలని పేర్కొంది. అనంతరం తుది తీర్పును రిజర్వ్​ చేసి, ఈ నెల 13కు వాయిదా వేసింది. అయితే, ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విచారణలో ఆయన ఇచ్చే స్టేట్​మెంట్​ను బట్టి ఈ కేసులో ముందస్తు బెయిల్​పై తుది తీర్పు ఆధారపడి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!