epaper
Wednesday, February 18, 2026
epaper

గాయత్రి ఫైనాన్స్​ యజమాని మిస్టరీ డెత్

కలం, వెబ్​ డెస్క్​ : ఏలూరు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు ఆలపాటి నాగేశ్వరరావు (Alapati Nageswara Rao) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతదేహం కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని ఒక చెరువులో లభ్యమైంది. ఏలూరు (Eluru) నగరంలో గాయత్రి ఫైనాన్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తూనే, మానవత సంస్థ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి స్థానికంగా గుర్తింపు పొందారు.

ఈ నెల 9వ తేదీ ఉదయం తన కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన నాగేశ్వరరావు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చిక్కవరం చెరువులో ఆయన మృతదేహం తేలియాడటం స్థానికంగా కలకలం రేపింది. నాగేశ్వరరావు (Alapati Nageswara Rao) మృతికి గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఎరువుల యాప్​ @ 13 లక్షలు.. నల్లగొండ టాప్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>