epaper
Wednesday, February 18, 2026
epaper

ఎరువుల యాప్​ @ 13 లక్షలు.. నల్లగొండ టాప్

కలం, వెబ్​డెస్క్​: డీలర్​ దుకాణాల వద్ద రద్దీని అరికట్టేలా, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఎరువుల యాప్ (Fertiliser App) ​కు క్రమేపీ ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్​ఫోన్​ల సమస్యతో మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం అవగాహన పెరగడంతో దానికి తగినట్లుగానే బుకింగ్స్​లో పెరుగుదల కనిపించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఎరువుల యాప్​ల ద్వారా బుకింగ్స్​ తదితర వాటి గురించి వెల్లడించింది. దీని ప్రకారం.. శనివారం(ఫిబ్రవరి 14) నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్​ ద్వారా 12.73లక్షల మంది రైతులు ఎరువుల యాప్​ను వినియోగించి, 50.48లక్షల యూరియా సంచులు బుక్​ చేసుకున్నారు.

ఇందులో 46.13 లక్షల సంచులను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారు. ఫర్టిలైజర్స్​ యాప్​ డౌన్​లోడ్స్​, బుకింగ్స్​, కొనుగోలులో నల్లగొండ జిల్లా టాప్​లో ఉంది. ఇక్కడ ఎరువుల యాప్​ ద్వారా మొత్తం 1,66,704 మంది రైతులు 7,58,949 సంచులు బుక్​ చేసుకున్నారు. ఇందులో 7,45,183 సంచులు కొనుగోలు చేశారు. కుమురం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 1,977 రైతులు 9,491 సంచులు బుక్​ చేసుకున్నారు. 6,314 సంచులు కొనుగోలు చేశారు.

Fertiliser  App ఎరువుల బుకింగ్స్​, కొనుగోలులో టాప్​ 5 జిల్లాలు ఇవీ

జిల్లా                     రైతులు              బుక్​ చేసిన సంచులు         కొనుగోలు చేసిన సంచులు

నల్లగొండ           1,66,704              7,58,949                        7,45,183

జగిత్యాల           1,38,469             5,08,884                         5,08,884

పెద్దపల్లి              91,935              3,84,589                        3,80,707

సూర్యాపేట          80,654               3,07,761                        2,77,901

ఖమ్మం                70,785              3,18,931                        2,85,270

మిగిలిన జిల్లాల వివరాల కోసం కింది ఇమేజ్ పై క్లిక్ చేయండి..

Read Also: కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>