Mobile Popup Ad
Mobile Popup Ad

ఏబీఎన్ రాధాకృష్ణ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏబీఎన్ (ABN) ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌ (Radhakrishna)పై వైసీపీ నాయ‌కులు పులివెందుల‌ (Pulivendula)లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఛానెల్‌లో త‌మ‌ మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకర రీతిలో కథనాలు ప్ర‌సారం చేశార‌ని వైసీపీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణపై, ఛానెల్ ప్రతినిధులపై కేసు నమోదు చేయాలని పోలీసుల‌ను కోరారు. మ‌రోవైపు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌సార‌మైన క‌థ‌నంపై ఆగ్ర‌హం వ్వ‌క్తం చేస్తూ తిరుప‌తిలో వైసీపీ నాయ‌కులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఆందోళ‌న‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఇష్టారీతిన క‌థ‌నాలు ప్ర‌చురిస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. వైసీపీ నాయ‌కులు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ప్ర‌తుల‌ను ద‌హ‌నం చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Read Also: తాత నీ ధైర్యానికి సలాం.. గేదెలను కాపాడేందుకు చీతాను తరిమేశాడు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>