జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణతో పాటు 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. అలాగే నవంబర్ 14న కౌంటింగ్ జరగనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 13 నుంచి మొదలవుతుందని స్పష్టం చేశారు.
Jubilee Hills | కాగా, సోమవారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశ్యవ్యాప్తంగా జరగనున్న ఉపఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించారు. రెండు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత నవంబర్ 11న నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది అని చెప్పారు.

