భారతదేశ నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. దాని పేరే ‘ఆండ్రోత్’(INS Androth). సముద్రజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికి పసిగట్టడం ‘ఆండ్రోత్’ స్పెషాలిటీ. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ‘యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్’ ఆండ్రోత్ ఎంట్రీ ఇచ్చింది. నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్(Rajesh Pendharkar) ఆధ్వర్యంలో దీన్ని కమిషనింగ్ చేశారు. దీనిని కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ నౌక నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(GRSE) నిర్మించింది. ఈ శ్రేణిలో మొదటిది ఐఎన్ఎస్ అర్నాలా కాగా దానిని జూన్ 18న లాంఛనంగా నేవీలో చేర్చారు. లక్షదీవుల్లోని అండ్రోత్ దీవి పేరును రెండో యుద్ధనౌకకు ఖారారు చేశారు.
‘ఆండ్రోత్(INS Androth)’ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇది 30ఎంఎం సర్ఫేస్ గన్‌తో ఉంటుంది. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది. వాటిలో ఎనిమిది నౌకలను జీఆర్ఎస్ఈ తయారు చేస్తోంది. ఇవి విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రువుల జలాంతర్గాములను వేటాడే సామర్థ్యం వీటి సొంతం.

