జాతీయ ఎన్నికల సంఘం(ECI) సంచలన నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ ప్రక్రియలో 17 కీలక మార్పులు తీసుకురావాలని ఫిక్స్ అయింది. వీటిని అత్యంత ఆసక్తి రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల సందర్భంగానే ఆయన ఈ మార్పులను కూడా ప్రకటించారు.
ECI – పోలింగ్‌లో వచ్చే మార్పులివే..
1. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ
2. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు
3. ప్రతి బూత్లో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1200కు తగ్గింపు
4. EVMలపై అభ్యర్థి కలర్ ఫొటో, పెద్ద సైజులో అక్షరాలు
5. బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉంటారు
6. ప్రతి బూత్లో 100% వెబ్ కాస్టింగ్
7. బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ట్రైనింగ్
8. బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడి VVPATలు కూడా లెక్కిస్తారు
9. BLO, BLO సుపర్వైజర్లకి ట్రైనింగ్
10. శాంతి భద్రతల నిర్వహణపై పోలీసులకు సెషన్స్
11. అక్రమ ఓటర్లను తొలగించేలా SIR
12. పోలింగ్ సిబ్బందికి రెమ్యూనరేషన్ పెంపు
13. పోలింగ్ స్టేషన్ సులువుగా గుర్తించేలా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రీడిజైనింగ్
14. ECIకి గల 40 వేర్వేరు ప్లాట్ఫాంలను ECINET అనే సింగిల్ డెస్టినేషన్గా మార్పు
15. బూత్ల నుంచి అభ్యర్థుల తరఫు వారి టేబుల్స్ దూరం 200మీ. నుంచి 100మీ.కి తగ్గింపు
16. ఎన్నికల తర్వాత ఎంతమంది ఓటేశారు, వారిలో పురుషులు, మహిళలు, ఇతరులు ఎందరో తెలుసుకునేలా సైట్లో డిజిటల్ ఇండెక్స్ అందుబాటులో ఉంచుతుంది.
17. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేది. ఇకపై EVMలతో లెక్కింపు మొదలుపెడతారు. EVMల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్కు ముందు పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు.

