ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి(Rohin Reddy)పై ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. తమపై రోహిన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. డీసీసీ మీటింగ్‌లో నాయకుల మధ్య ఘర్షణ నెలకొందని, ఆ సందర్బంగా తమపై కేసులు పెట్టిస్తానంటూ రోహిన్ రెడ్డి బెదిరించాడని నాయకులు వివరించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన మీనాక్షి నటనరాజన్(Meenakshi Natarajan).. రోహిన్ తో మాట్లాడతానని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కొండా సురేఖ(Konda Surekha) ఎపిసోడ్ నడుస్తున్న సమయంలో రోహిన్ రెడ్డిపై ఫిర్యాదు అందడం కీలకంగా మారింది. రోహిన్ రెడ్డి.. దందాలు చేస్తున్నారని కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(Konda Sushmitha) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలోనే ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు కూడా రోహిన్(Rohin Reddy)పై ఫిర్యాదు చేయడంతో ఆయనపై చర్యలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా సుస్మితా రెడ్డి చేసిన ఆరోపణలు ఆధారంగా పార్టీ పరంగా దర్యాప్తు కూడా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
Read Also: మరోసారి ఈవేలానికి రెడీ అయిన సర్కార్..

