కలం, వెబ్ డెస్క్: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) చనిపోయాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. తర్వాత అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీంగా ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడులో మొజ్తబా కూడా మృతి చెంది ఉండొచ్చని, లేదా ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇరాన్ దాచిపెడుతోందని ఆరోపించారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఆ దేశానికి చెందిన అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టామని ట్రంప్ అన్నారు.
అమెరికా సైనిక చర్యల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా నిర్వీర్యమైందని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందని, వారి వైమానిక దళం, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ తయారీ కర్మాగారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉందని, అందుకే వారు ఇప్పుడు అమెరికాతో ఒప్పందం కోసం ప్రాధేయపడుతున్నారని ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యానించారు. మరోవైపు మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టివేస్తూనే ఉంది. ట్రంప్ ఇరాన్‌కు భయపడ్డారని, అందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read Also: నిజామాబాద్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలి: మహేశ్ కుమార్ గౌడ్
Follow Us On: Instagram

