కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక సూచనలు చేశారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నగర అభివృద్ధి (Nizamabad development), మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్‌లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను వేగవంతం చేయాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నగరస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయాలన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పారదర్శకతతో పనులు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

