కలం, భువనగిరి : నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు (Car Fire Accident) చెలరేగడంతో పూర్తిగా దగ్దమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలోని కేపాల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే, వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు టీఎస్ 03 EN 6575 నెంబర్ గల కారు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణం మధ్యలోనే కారులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే వాహనం నుంచి బయటకు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
Read Also: టెంపుల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. చితకబాదిన స్థానికులు!
Follow Us On: Instagram

