Mobile Popup Ad
Mobile Popup Ad

పొలిటికల్ యాత్రలతో ఓట్లు రాలేనా?

కలం, తెలంగాణ బ్యూరో: అధికారం కోసం పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ లీడర్లకు ఓ ఆనవాయితీ. ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఈ ఫార్ములాను ఒంటబట్టించుకున్నారు. పవర్‌లోకి రావడానికి ఇదో టర్నింగ్ పాయింట్ అని విశ్వసిస్తారు. కొందరు లీడర్లు సక్సెస్ అయ్యారు. మరికొందరికి బెడిసికొట్టింది. కొందరు పాదయాత్రలు (Political Padayatras)  చేపడితే.. మరికొందరు హైబ్రిడ్ యాత్రలు చేశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. దానికి తగినట్లు హామీలతో మేనిఫెస్టోలను రూపొందించుకున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు 2003లో మహాప్రస్థానం పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నింటినీ చుట్టేలా పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత దాన్నే చంద్రబాబు కూడా నమ్ముకున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ అంటూ జనం బాట పట్టారు. ఫలితంగా కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

ఏపీలో వైఎస్ జగన్, నారా లోకేశ్, పవన్​ కల్యాణ్​.. తెలంగాణలో వైఎస్ షర్మిల, భట్టి విక్రమార్క, బండి సంజయ్ కూడా యాత్రలతో జనంలోకి వెళ్లారు. షర్మిల మినహా మిగిలినవారికి ఇవి కలిసొచ్చాయి. వీరిలో కొందరు పవర్‌లోకి వచ్చారు. బండి సంజయ్​ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులయ్యారు. పదేండ్లు అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది నుంచి రంగంలోకి దిగుతానని ప్రకటించారు.

‘పాదయాత్రలు ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్.. ఇప్పటి టెక్నాలజీ పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదు..’ అని అధికారంలో ఉన్నప్పుడు 2022లో కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా కనీసం ప్రజలనూ కలవడంలేదు. అందుబాటులోనూ లేరు. ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. ‘మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు..’ అంటూనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్. గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు పాదయాత్ర అవసరమేంటనే ప్రశ్నకు సమాధానం లేదు.

కేటీఆర్ పాదయాత్ర బీఆర్ఎస్‌కు మైలేజీ ఇస్తుందా?.. ఓట్లను రాలుస్తుందా?.. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్​ ను ఎందుకు ఎంచుకున్నారు?.. కేసీఆర్ అభిప్రాయంతో కేటీఆర్ విభేదిస్తున్నారా?.. పదేండ్ల పాలనలోని తప్పులకు పాదయాత్రలో కేటీఆర్ క్షమాపణలు చెప్తారా?.. కొత్త పార్టీ పెడతానంటున్న చెల్లెలు కవితతో పొలిటికల్ త్రెట్ ఉందనుకుంటున్నారా?.. ఓట్లు, సీట్లు, అధికారం చుట్టూ తిరుగుతున్న పాదయాత్రలపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Political Padayatras
Political Padayatras

Read Also: బీజేపీ మాస్టర్ స్కెచ్.. విపక్షాలకు ఊహించని దెబ్బ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>