అనిల్ రావిపూడి లేటెస్ట్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. వరుసగా సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన  “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది. దీనితో ఈ యంగ్ డైరెక్టర్ వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేశారు. మరోసారి మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకులని పలుకరించనున్నాడు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) కలిసి నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా దర్శకుడు అనిల్ (Anil Ravipudi) ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సోదరుడు సాయి గరపాటి నిర్మాతగా షైన్ స్క్రీన్స్(Shine Screens) బ్యానర్ లో మూడోసారి కలిసి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా జీ స్టూడియోస్  కూడా ఈ ప్రయాణంలో చేరడం గర్వంగా ఉందని, అలాగే లెజెండరీ సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని సమర్పిస్తుందని తెలిపారు.

Read Also: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు ప్రమాదం !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>