మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు ప్రమాదం !

కలం, వెబ్ డెస్క్ : పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటుతో మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం, మహిళల్లో గుండెపోటు(Heart Attack) లక్షణాలు భిన్నంగా, నిగూఢంగా ఉండటమేనని ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ (Jeremy London) హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సినిమాల్లో చూపించినట్లుగా ఛాతీని పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు మహిళల్లో చాలా అరుదుగా కనిపిస్తాయని ఆయన తెలిపారు.

మహిళల్లో గుండెపోటు వచ్చినప్పుడు స్పష్టమైన లక్షణాలకన్నా, సున్నితమైన సంకేతాలే ఎక్కువగా కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట, వికారం, వాంతులు, స్వల్పంగా ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ లక్షణాలను ఇతర అనారోగ్యాలుగా పొరబడి చాలామంది మహిళలు (Women) వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తారు. ఫలితంగా వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, సమయానికి చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం. అప్రమత్తత, ముందస్తు జాగ్రత్తలతో గుండెపోటు ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>