Mobile Popup Ad
Mobile Popup Ad

మార్కాపురం బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో డ్రైవర్

కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం (Markapuram) బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంత మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు యజమాని, డ్రైవర్ హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సు నుంచి దూకి పారిపోయాడు. నెల్లూరు పారిపోతుండగా.. పామూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మరికొద్ది సేపట్లో మార్కాపురం పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు స్టీరింగ్ జామ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. రిపేర్లు ఉన్న బస్సును నడిపి ఇంత మంది ప్రాణాలు తీశారంటూ డ్రైవర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

Read Also: శ్వాసకోశ వ్యాధులకు మీ ఇల్లూ కారణమే.. ఎందుకో తెలుసా?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>