మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పచ్చజెండా ఊపేసినట్లే ఉన్నాడు. పవన్‌తో హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) భారీగా ప్లాన్ చేస్తున్నడని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ మేరకు తన ప్రాజెక్ట్ కోసం పవన్ కల్యాణ్(Pawan Kalyan) డేట్స్‌ను కూడా దిల్ రాజు లాక్ చేసేశాడు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. ఇదే జోష్‌లో పవన్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ టైప్‌లో మరో సినిమాను పీకేతో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసమే పవన్.. డేట్స్‌ను లాక్ చేసేశాడు.
దిల్ రాజు నిర్మాణంలో పవన్ చేయనున్న సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ‘వకీల్ సాబ్’ తరహాలోనే సోషల్ మెసేజ్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇది కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని, పక్కా కమర్షియల్ అంశాలతో ఫుల్లీ ఫ్యాక్డ్ పార్సిల్ టైప్‌లో వస్తుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు.. సరైన కథ, దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలైన తర్వాతే దిల్ రాజు(Dil Raju), పవన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

