ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ అంటే గోల్డెన్ స్పూన్ బేబీస్ అంటారు. వాళ్లు కష్టపడాల్సిన అవసరమే లేదు.. అవకాశాలే వాళ్ల కోసం వెయిట్ చేస్తుంటాయి అంటారు. ట్యాలెంట్ ఉన్న వాళ్లని ఈ నెపో కిడ్స్ తొక్కేస్తున్నారని అనే వారూ చాలా మందే ఉన్నారు. అయితే బాలీవుడ్ స్టార్, ఒక స్టార్ కిడ్ అయిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) మాత్రం వేరేలా చెప్తోంది. అసలు తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేడంటూ హాట్ కామెంట్స్ చేశారామే. బయట వ్యక్తుల కష్టాలు వినడానికి అందరూ ఇంట్రస్ట్ చూపుతారని, కానీ ఇండస్ట్రీకి చెందిన వారి ఇబ్బందులు, సమస్యలు మాత్రం ఎవరికీ పట్టవని అన్నారు. తాజాగా ఓ చర్చలో పాల్గొన్న జాన్వీ.. నెపో కిడ్స్, నెపోటిజమ్ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగానే యాక్టర్స్‌ను లోపలి వారు, బయటి వారు అని వేరు చేయడం తనకు నచ్చదన్నారు.
‘‘స్టార్ కిడ్స్ ఇబ్బందులు చెప్పినా విడ్డూరంగా ఉంటాయి. వాటిని వినడానికి కూడా ఎవరూ ఇంట్రస్ట్ చూపరు. అయినా ఇండస్ట్రీలో ఏ స్టార్ కిడ్ కూడా తాము కష్టాలు పడ్డామని చెప్పరు. ఎందుకంటే బయటి వారితో పోలిస్తే వారికి అందిన సౌకర్యాలకు వాళ్లు కృతజ్ఞతతో ఉంటారు. అలాకాకుండా ‘మేం ఇంత కష్టపడుతున్నాం’ అని చెప్తే ఎవరూ వినను కూడా వినరు. బయటి నుంచి వచ్చిన వాళ్లు ఇండస్ట్రీలో గుర్తింపు పొందాలంటే చాలా పోరాటాలు చేయాలి. దానిని నేను కూడా నమ్ముతా. ఆ పోరాటాలు స్టార్ కిడ్స్‌కు అర్థం కావు. అలాగని స్టార్ కిడ్స్‌కు ఏ కష్టాలు ఉండవని కుదరదు. మేం కూడా మా పోరాటాలు మేం చేస్తాం. కానీ అవి ఎవరికీ పట్టవు’’ అని జాన్వీ(Janhvi Kapoor) చెప్పుకొచ్చింది.

