epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బాలయ్య NBK 111 అంతకు మించి..!

కలం, సినిమా : నట సింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య.. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఎన్ బీ కే 111 (NBK 111) మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారని.. ఈ రెండు పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. అయితే.. ఈ సినిమా కథ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాకి స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ కథ అందిస్తున్నారు. అయితే.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో NBK 111 చిత్రం మామూలు సినిమా కాదని.. ఇందులోని కథ వేరే లెవల్లో ఉంటుందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ షాక్ అవ్వడం ఖాయమని.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి గర్వపడతారని చెప్పారు. సాయిమాధవ్ బుర్రా ఇలా చెప్పినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

బాలయ్య సినిమా అంటే.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించడం కామన్ అయిపోయింది. అయితే.. ఇందులో కనిపించే ఈ రెండు పాత్రలు ఊహించని విధంగా ఉంటాయని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తాయని అంటున్నారు. బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా స్పీడుగా కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేశారని సమాచారం. నెక్ట్స్ ఇయర్ ద్వితీయార్ధంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Read Also: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై న్యూ అప్డేట్..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>