కలం, నిజామాబాద్ బ్యూరో : ధర్మపురి సంజయ్ కి పదవి కేటాయించాలంటూ ఆయన అభిమానులు నిజామాబాద్ లో నిరాహార దీక్షలు చేపట్టారు. సంజయ్ (Dharmapuri Sanjay) కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. డీ. శ్రీనివాస్ పెద్ద కొడుకు అందులోనూ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ తొలి మేయర్ అయిన సంజయ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
పార్టీ కోసం ఎన్నికల్లో ఎంతో కృషి చేసిన ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) కి.. రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ న్యాయం జరగకపోతే.. సంజయ్ ఏ పార్టీకి వెళ్ళినా తాము ఆయనతోనే ఉంటామని స్పష్టం చేశారు. నిరాహార దీక్షలో సంజయ్ అభిమానులు ఆకుల చిన్న రాజేశ్వర్, వెంకటేష్, కపిల్, పుప్పాల భాజన్న, సక్కి విజయ్, పుప్పాల విజయ, సందీప్, రణధీర్, రింపు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Follow Us On: X(Twitter)

