కలం, కరీంనగర్: భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ (BJYM Karimnagar) ఆధ్వర్యంలో గురువారం రోజున తలపెట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” “స్టూడెంట్ మార్చ్” ప్రోగ్రాంను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో గీతా భవన్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న స్టూడెంట్ మార్చ్ ర్యాలీకి యువకులు, విద్యార్థులు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు.
పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” పేరిట బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా కరీంనగర్లో తలపెట్టిన ఈ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ హాజరవుతారని తెలిపారు.

