కలం, ఖమ్మం బ్యూరో : ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ జనం దృష్టి మరల్చేందుకే ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) మండిపడ్డారు. గజ్వేల్ (Gajwel) నియోజకవర్గ కేంద్రంలోని కేసీఆర్ క్యాంప్ ఆఫీసుపై జరిగిన దాడిని రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తి అని, దానిపై దాడికి దిగి ధ్వంసం చేసి భీభత్సం సృష్టించడమంటే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడమేనన్నారు.
మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై వందలాది మంది చూస్తుండగా పట్టపగలు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ దుండగులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డిని ఎంపీ వద్దిరాజు (MP Vaddiraju) డిమాండ్ చేశారు.
Read Also: గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు
Follow Us On: X(Twitter)

