తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో విజిలెన్స్ సోదాలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Inter Board) కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులు విజిలెన్స్ అధికారులు నాలుగు గంటలుగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. 2019లో ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు. గ్లోబరీనా కంపెనీ టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలపై ఇంటర్మీడియట్ బోర్డు మాజీ సెక్రటరీ అశోక్‌ను విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు.

2019 ఇంటర్ ఫలితాల వ్యవహారంలో గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంతో పాటు గ్లోబరినా ఆఫీసుల్లోనూ విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టి పలు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో గ్లోబరీనా సంస్థ పేరు మళ్లీ తెరమీదకు రావడంతో బుధవారం విజిలెన్స్ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>