ముంబై బ్యాటింగ్ పూర్తి.. స్కోరు ఎంతంటే?

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ (DC vs MI) తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(0) డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ (39) ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51)హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (5) తక్కువ స్కోరే చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో నమన్ ధీర్ (29) ఔట్ అయ్యాడు. చివర్లో మిచెల్ శాంట్నర్ (18), కార్బిన్ బాష్ (11) అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రద స్కోరు దక్కేలా చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. విప్రాజ్, అక్షర్ పటేల్, లుండి ఎంగిడి, నటరాజన్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో 163 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంటుందా? ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేసి సంచలనం సృష్టిస్తారా? అనేది మరికాసేపట్లో తేలనుంది.

Read Also: ‘డెకాయిట్’ ట్రైలర్‌పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>