Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ పోలీసింగ్‌లో మరింతగా ఏఐ వినియోగం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసింగ్ విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు డీజీపీ సీవీ.ఆనంద్ (DGP CV Anand) కీలక చర్యలు చేపట్టారు. శాంతి భద్రతల నిర్వహణ, నేరాల దర్యాప్తులో ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు సమగ్ర రోడ్ మ్యాప్ తయారీపై ఈ రోజు సమీక్ష జరిపారు. పోలీస్ వ్యవస్థలో సాంకేతిక వినియోగం అనేది ఇన్నాళ్లు ఆప్షన్ మాత్రమే అని.. మారిన పరిస్థితుల్లో ఇది అత్యవసరంగా మారిందని.. దాన్ని సిబ్బంది అందరూ ఉపయోగించాలని సూచించారు.

కీలక వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు..

ప్రధానంగా ఏఐ ఆధారిత పోలీసింగ్ కార్యక్రమాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ.ఆనంద్ (DGP CV Anand).. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక టెక్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇప్పటివరకు వేర్వేరుగా CCTNS, HRMS, Hawkeye తదితర ప్రధాన ప్లాట్‌ఫామ్‌లను ఒకే సమగ్ర వ్యవస్థ కిందకు తీసుకురావాలని సూచించారు. టెక్నాలజీ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని అధికారులకు సూచించారు.

Read Also: హృదయవిదారకం.. తెగిన తల్లి చేయితో పోలీస్ కమిషనరేట్‌కి జవాన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>