epaper
Tuesday, November 18, 2025
epaper

అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా: పవన్

ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలే వదిలేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మేలు చేయాలని, న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అదే చేయలేకపోతే ఇంకెందుకు అన్నారు. ఉప్పడలో నిర్వహించిన మత్స్యకారుల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు ఆయన తీపికబురు చెప్పారు. ఉప్పాడ(Uppada)లో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామన వెల్లడించారు. ఇప్పటికే ఉప్పాడ-కొణపాక మధ్య తీర రక్షణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అక్టోబర్ 14న సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై సమావేశం జరగనుందని వెల్లడించారు.

‘‘పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదని మత్స్యారులు చెప్తున్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని మత్స్యకారులు చెప్పారు. ఈ అంశంలో మత్స్యకారులు ఎక్కడికంటే అక్కడికి వస్తా. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడకు బోటులో వెళ్తా. వంద రోజులు సమయం ఇవ్వండి కాలుష్యాన్ని తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ప్రజలను వంచించాల్సిన అవసరం నాకు లేదు. ప్రజలకు న్యాయం చేయడమే నా ధ్యేయం. అదే చేయలేకపోతే రాజకీయాలనే వదులుకుంటా’’ అని Pawan Kalyan పేర్కొన్నారు.

Read Also: బీహార్ ఎన్నికలు.. ఏఐపై నిబంధనలు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>