బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) వేడి రోజురోజుకు అధికం అవుతోంది. ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచార రథాలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఏఐ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీల ఏఐ వినియోగంపై పలు నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీప్‌ఫేక్‌లను సృష్టించడానికి, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడానికి ఏఐ వినియోగించొద్దని తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రకటనలు విడుదల చేసింది.
‘‘రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో అనేక విషయాలు పంచుకుంటాయి. ఒకవేళ అవి ఏఐ జనరేటెడ్, కల్పితాలు అయితే ఆ విషయాన్ని కచ్చితంగా ఆ పోస్ట్‌లోనే స్పష్టం చేయాలి. పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ప్రముఖంగా ఈ విషయాన్ని గుర్తించాలి. ఎన్నికల(Bihar Elections) ప్రక్రియపై ప్రభావం పడకుండా ఉండేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పోస్ట్‌లు పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతి పోస్ట్‌పై నిఘా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది’’ అని ఎన్నికల సంఘం పేర్కొంది.
Read Also: ట్రంప్ శాంతి సంతకాలపై మోదీ పోస్ట్.. ఏమన్నారంటే..!

