Mobile Popup Ad
Mobile Popup Ad

డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రంను రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాలలో శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.15,800 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాలలో ఏర్పాటు కానున్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌తో పాటు రక్షణ, డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టులు చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 7,500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని, పరిశ్రమలు, సాంకేతిక రంగాలలో  వేగవంతమైన అభివృద్ధికి దోహదపడతాయని పవన్ కల్యాణ్ అన్నారు.

భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్‌ను ఆకర్షించే సామర్థ్యం ఈ ప్రాజెక్టులకు ఉందని చెప్పారు. యువతకు అధిక విలువ కలిగిన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా ఆంధ్రప్రదేశ్ తదుపరి తరం తయారీ, ఇన్నోవేషన్ రంగాలలో అగ్రస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ, రాష్ట్రాలకు మద్దతుగా మార్పు తీసుకొచ్చే జాతీయ ప్రాజెక్టులను అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ పాత్రను బలోపేతం చేయడంలో సహకరిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి, ఇన్నోవేషన్, భవిష్యత్ పెట్టుబడుల దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరింత వేగవంతం చేసి యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>