పదో తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

కలం, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి (Undavalli) మండలం బొంకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ దేవాలయ కమిటీ మాజీ ఛైర్మన్ బెక్కం శ్రీనివాస్ రెడ్డి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు రూ.5000 చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించే గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>