కలం , కరీంనగర్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఈనెల 9 నుంచి 13 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా “అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలు” (All India Police Games) నిర్వహించారు. ఈ పోటీలలో కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ (Huzurabad) ఏసీపీ (ACP Madhavi) వి.మాధవి అద్భుత ప్రదర్శనతో రాణించి ఘన విజయం సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన గట్టి పోటీని తట్టుకొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ఆమె ఏకంగా నాలుగు పతకాలను కైవసం చేసుకుని రాష్ట్ర పోలీస్ శాఖకు, కరీంనగర్ కమిషనరేట్‌కు కీర్తిని తెచ్చిపెట్టారు.
హుజూరాబాద్ ఏసీపీ మాధవి సాధించిన పతకాలు
టేబుల్ టెన్నిస్ (Table Tennis) విభాగం జి.ఓ. 50+ మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచి రజత పతకం (Silver Medal) సాధించారు.
జి.ఓ. 40+ (G.O. 40+) విభాగం మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో గట్టి పోటీనిచ్చి కాంస్య పతకం (Bronze Medal) కైవసం చేసుకున్నారు.

