కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు మరోసారి తీవ్రతరం (Delhi Violence) అయ్యాయి. పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం దాడి చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు, ఆర్ఏఎఫ్ (RAF) సిబ్బందిపైకి పలువురు ప్రొటెస్టర్లు రాళ్లు, బాటిళ్లు విసిరారు. చేతిలో కర్రలను పట్టుకొని పోలీసులపైకి దాడికి దిగారు. కొందరు ఆందోళనకారులు పోలీసుల లాఠీలు లాక్కొని దాడి చేశారు. దీంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అక్కడ పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే అధికారులు జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించారు. ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

