మోక్షజ్ఞ సినీ అరంగ్రేటం.. ఆయనే దర్శకుడు!

కలం, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ అరంగ్రేటంపై అధికారిక ప్రకటన వెలువడింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో నందమూరి వారసుడి మొదటి మూవీ తెరకెక్కబోతుంది. ”కూన గుహను వీడింది.. అడవిలోకి సింహంగా అడుగు పెడుతోంది” అంటూ బాలయ్య, మోక్షజ్ఞతో నిర్మాత నవీన్ ఎర్నేని ఉన్న ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర మూవీ తీస్తున్నారు. ఇది పూర్తయ్యాకే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో మొదలు కానుందని సమాచారం.

ఎన్నో అడ్డంకుల తరువాత..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడో మూవీని ప్రకటించారు. ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. కారణాలేంటో తెలియదు. ఆ తరువాత మోక్షజ్ఞతో క్రిష్‌ జత కట్టబోతున్నాడనే వార్తలు వచ్చినా అవేమీ నిజం కాలేదు. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తీపికబురు చెబుతూ ఎట్టకేలకు మొదటి మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>