కలం, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాతో బాలయ్య అభిమానులకు క్రిస్మస్ కానుకగా మరో మాస్ ట్రీట్ సిద్ధమవుతోంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ చిత్రానికి ‘దాదా’ (DADA) అనే పక్కా మాస్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
“Christmas is the season. DADA is the reason” అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ త్వరలో విడుదల కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో బాలయ్య అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాలకృష్ణ మరోసారి తనదైన మాస్ అవతార్‌తో అలరించబోతున్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
Also Read : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!
Follow Us On: X(Twitter)

