బండి సంజయ్ ఇంట పెళ్లి వేడుక.. హాజరైన కౌశిక్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఉప్పు- నిప్పులా ఉండే బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay), బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఒకే వేదికను పంచుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ అన్న కూతురు వివాహా వేడుకలకు హాజరయ్యారు. కౌశిక్ రెడ్డి పెళ్లి వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బండి సంజయ్ తో కరచాలం చేస్తూ నవ్వుతూ మాట్లాడారు. ఇది చూసిన జనాలు ఇది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న అందం అని కొనియాడుతున్నారు.

అయితే, గతంలో కరీంనగర్‌లో బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరులు కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో కరీంనగర్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి.. బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో మాటలతో విరుచుకుపడ్డారు. ఆ సంఘటన తరువాత ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

Also Read : ఒకరు దూరం.. మరొకరు దగ్గర: కోమటిరెడ్డి బ్రదర్స్ ‘మార్క్’ పాలిటిక్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>