టెలిగ్రామ్‌ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్‌

కలం, వెబ్ డెస్క్: టెలిగ్రామ్‌‌పై (Telegram) తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది. నీట్‌ పరీక్ష కారణంగా జూన్‌ 22వ తేదీ వరకు యాప్‌ను దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పరీక్షల పారదర్శకత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిషేధం అవసరమని సమర్థించుకున్నారు. అంతేగాకుండా, టెలిగ్రామ్ కేంద్రంగా అనేక దారుణ విషయాలు జరుగుతున్నట్లు తమకు తెలిసిందన్నారు. వీటిని అఫిడవిట్ రూపంలో రాబోయే రోజుల్లో కోర్ట్ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>