నిర్మల్‌లో ఘోరం.. అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పెద్దోల్ల లింబాద్రి (45)కి తన అన్న బాబన్నతో భూ వివాదాలపై గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన బాబన్న కత్తితో లింబాద్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావానికి గురైన లింబాద్రిని కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం నిందితుడు బాబన్న పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>