Mobile Popup Ad
Mobile Popup Ad

రిటైర్డ్ ఐఏఎస్ రజత్‌కుమార్‌ కు ఢిల్లీ హై కోర్ట్ షాక్

కలం, తెలంగాణ బ్యూరో : రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌పై వచ్చిన ఆరోపణలను నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని డీవోపీటిని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదులు వచ్చిన నిబంధనల ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని కోర్టుకు తెలియజేయాలని డీవోపీటీని ఆదేశించింది. తెలంగాణ బ్యాచ్‌ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ (Rajat Kumar) ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలో తన కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ ఖర్చుల్ని ‘మేఘా’ కంపెనీ భరించిందని కొన్ని ఆధారాలతో గవినోళ్ల శ్రీనివాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐఏఎస్ అధికారుల వ్యవహారాలు చూసే డీవోపీటీకి 2022 జనవరిలోనే ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలేవీ లేవని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదును తెలంగాణ చీఫ్ సెక్రటరీకి పంపి ఊరుకున్నారే తప్ప ఇన్వెస్టిగేషన్ చేయలేదని, తీసుకున్న చర్యల గురించీ తనకు సమాచారం ఇవ్వలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జడ్జి పురుషేంద్రకుమార్ కౌరవ్… ఫిర్యాదులు వచ్చిన్పపుడు నిర్దిష్ట టైమ్ బౌండ్‌లో విచారించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని డీవోపీటీకి స్పష్టం చేశారు. ఈ తీర్పు కాపీ అందుకున్న మూడు నెలల్లోగా ఇన్వెస్టిగేషన్‌ను కంప్లీట్ చేయాలని నొక్కి చెప్పారు. ఫిర్యాదు వస్తే దాన్ని సంబంధిత రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపితే మాత్రమే సరిపోదని, అక్కడితోనే బాధ్యత ముగిసిపోదని వ్యాఖ్యనించారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి డీవోపీటీ ఫార్వర్డ్ చేసిన తర్వాత మూడు నాలుగు వారాల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం వచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో రజత్ కుమార్‌పై (Rajat Kumar) దాదాపు నాలుగేండ్ల తర్వాత విచారణ మొదలుకానున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా సంస్థ దాదాపు రూ. 50 లక్షల మేర రజత్ కుమార్ కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ ఖర్చులు భరించిందని, ఇరిగేషన్ డిపార్టుమెంటు సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది పిటిషర్ గవినోళ్ళ శ్రీనివాస్ ఆరోపణ. రిసెప్షన్ ఖర్చులకు సంబంధించిన కొన్ని బ్యాంకు లావాదేవీల వివరాలను, హోటళ్లకు చేసిన పేమెంట్ల ఆధారాలను డీవోపీటీకి, హైకోర్టుకు సమర్పించారు.

Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>